డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
ఢిల్లీలో 20 చోట్ల సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై చోట్ల సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సెప్టంబరు 1 నుంచి ఢిల్లీలో ఆరు నెలల పాటు పాత ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంద.ి కొత్త మద్యం చట్టం పై ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఈ విధానంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
లిక్కర్ పాలసీపై...
అయితే తనపై వచ్చిన ఆరోపణలను మనీష్ సిసోడియా ఖండించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిపై ఇలా వేధించడం అలవాటుగా మారిందని, ఇది దురదృష్టకరమని మనీష్ సిసోడియా అన్నారు. దీనిని రాజకీయ కుట్రగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.