కోల్‌కత్తా డాక్టర్ ఇంట్లో సీబీఐ సోదాలు

కోల్‌కత్తా‌లోని ఆర్‌జీ కేర్ వైద్య ఆసుపత్రి పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తుంది

Update: 2024-08-25 05:56 GMT

కోల్‌కత్తా‌లోని ఆర్‌జీ కేర్ వైద్య ఆసుపత్రి పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తుంది. ఆయన ఇళ్లతో పాటు సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా సీబీఐ తనిఖీలు చేస్తుంది. మొత్తం పది హేను చోట్ల ఏకకాలంలో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తుంది. కోల్‌కత్తాలోని ఆర్‌జీ కేర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనతో ఈయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

అవినీతి ఆరోపణలు...
డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈయన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను కూడా అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈయనను వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు సీబీఐకి ఇవ్వడంతో వారు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు డాక్టర్ దేబాశిష్ సోమ్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News