బెంగాల్ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు

పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది.

Update: 2022-09-07 07:18 GMT

పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అసన్‌సోల్ లోని ఆయన మూడు నివాసాలలతో పాటు కోల్‌కత్తాలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ దాడులు చేసింది. బొగ్గు కుంభకోణంపై మొలోయ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

బొగ్గు కుంభకోణంలో....
బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్రపై విచారణ చేస్తున్నట్లు సీీబీఐ అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో మంత్రి నివాసాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మొహరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈడీ మొలోయ్ ను ప్రశ్నించింది. ఈయనతో పాటు ఈ కుంభకోణంలో మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈడీ విచారించింది. వరసగా బెంగాల్ లో మంత్రుల ఇళ్లపై సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి పార్థా ఛటర్జీ కిచెందిన సన్నిహితులపై దాడులు నిర్వహించగా ఆయన పదవి కోల్పోయారు. చిట్ ఫండ్ స్కామ్ లోనూ ఎమ్మెల్యే సుబోధ్ అధికారి ఇళ్లపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News