విద్యార్థులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్
కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది
కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తించేలా నిర్ణయంతీసుకుంది. సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ ఉంటుందని కేంద్ర మంత్రివర్గ సమావేశం అభిప్రాయ పడింది.
రుణాలకు గ్యారంటీ...
7.5 లక్షల రూపాయల రుణాలకు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే నని కేంద్ర ప్రభుత్వం పేర్కంది. ఎనిమిది లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందని తెలిపారు. పది లక్షల రూపాయల వరకు రుణాలపై 3శాతం వడ్డీరాయితీని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. విద్యాలక్ష్మితో యువతకు అందుబాటులో నాణ్యమైన విద్య వస్తుందని అభిప్రాయపడింది.