పెళ్లిళ్ల కారణంగా పోలింగ్ తేదీ మార్పు

రాజస్థాన్ లో పోలింగ్ తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది

Update: 2023-10-11 13:24 GMT

Assembly elections loksabha in AP

ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీలను మళ్లీ మార్చింది. రాజస్థాన్ లో పోలింగ్ తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ తేదీ మాత్రం యాధాతధంగా ఉంచింది. నవంబరు 25వ తేదీన రాజస్థాన్ లో పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. పోలింగ్ తేదీ ప్రకటించిన రోజు దాదాపు యాభై వేల పెళ్లిళ్లు జరుగుతాయని, పోలింగ్ శాతం తగ్గే అవకాశముందని భావించి వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది.

రెండు రోజుల తర్వాత...
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం నవంబరు 23వ తేదీన రాజస్థాన్‌లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఒకే విడతలో ఎన్నికలు జరుపుతామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాజస్థాన్‌లో ఉన్న 200 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 23వ తేదీకి బదులు 25వ తేదీకి పోలింగ్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు ఆ రోజులో అత్యధికంగా ఉన్న కారణంగానే రెండు రోజుల పాటు వాయిదా వేశామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News