ఇకపై పార్లమెంట్ కు పహారా వారే!!
ఇటీవల లోక్ సభలో భద్రతా ఉల్లంఘన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. అంత ధైర్యంగా
ఇటీవల లోక్ సభలో భద్రతా ఉల్లంఘన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. అంత ధైర్యంగా ఎలా వచ్చారనే విషయాన్ని చాలా మందికి షాకింగ్ గా నిలిచింది. ఈ ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంట్ భవనం భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ, రాజ్యసభ భవనాల భద్రతను CISF బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ భవన సముదాయాన్ని పరిశీంచాలని కేంద్రం హోంశాఖ అదేశించింది. ఆ తర్వాత సీఐఎస్ ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగం పార్లమెంట్ కు కాపలా కాస్తాయని పార్లమెంట్ అధికార వర్గాలు తెలిపాయి.
CISF అనేది కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF), ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలను అణు, ఏరోస్పేస్ డొమైన్, పౌర విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోలు వంటి వాటికి రక్షణగా ఉంటుంది. CISFలోని ప్రభుత్వ భవన భద్రత యూనిట్ నుంచి కొందరు నిపుణులు, ప్రస్తుత పార్లమెంట్ భవనంలోని భద్రతా బృందలోని అధికారులతో పాటు భద్రతా బలగాలకు చెందిన ఫైర్ కంబాట్ ,రెస్పాన్స్ అధికారులు త్వరలో పార్లమెంట్ సర్వే చేపట్టనున్నారు. కేంద్రం నిర్ణయంతో కొత్త, పాత పార్లమెంట్ భవన కాంప్లెక్స్, వాటి అనుబంధ భవనలు రెండూ కూడా CISF భద్రత పరిధిలోని వస్తాయి. లో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(PSS), ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (PDG) కూడా ఉంటాయి. CISF
2001 పార్లమెంటు ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 13న జరిగిన భారీ భద్రతా ఉల్లంఘనలో, జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, డబ్బాల నుండి పసుపు పొగను విడుదల చేశారు. అదే సమయంలో, మరో ఇద్దరు పార్లమెంటు ఆవరణ వెలుపల నినాదాలు చేస్తూ డబ్బాల నుండి రంగు పొగను చల్లారు. సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్ అధ్యక్షతన ఒక కమిటీ పార్లమెంటు సముదాయం మొత్తం భద్రతను పరిశీలిస్తోంది.