రైతుల డిమాండ్ పై కేంద్రం కమిటీ

రైతులకు కనీస మద్దతు ధర డిమాండ్ తో పాటు వ్యవసాయరంగానికి సంబంధించి అంశాలపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది

Update: 2021-11-27 08:44 GMT

రైతులకు కనీస మద్దతు ధర డిమాండ్ తో పాటు వ్యవసాయరంగానికి సంబంధించి అన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కమిటీని నియమించామని మంత్రి తెలిపారు.

ఆందోళన విరమించుకోండి....
ఈ కమిటీ కనీస మద్దతు ధరలో పారదర్వకత లాంటి అంశాలను పరిశీలిస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దీంతో పాటు పంట వైవిధ్యం, జీరో బడ్జెట్ వ్యవసాయంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారన్నారు. ప్రభుత్వం కమిటీని నియమించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు విరమించుకోవాలని నరేంద్ర సింగ్ తోమర్ సూచించారు.


Tags:    

Similar News