పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు.. ఒమిక్రాన్ కేసులున్న..?

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్ లో ఇప్పటికే 245 కేసులు నమోదయ్యాయి;

Update: 2021-12-25 07:38 GMT

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్ లో ఇప్పటికే 245 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే అతి తీవ్రంగా పది రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అధ్యయనం చేసి.....
అక్కడ ఒమిక్రాన్ కేసుల నమోదు, కోవిడ్ నిబంధన అమలు వంటి వాటిపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. వ్యాక్సినేషన్ ఎంత మేరకు జరిగింది కూడా పరిశీలిస్తుంది. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదయిన కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లలో ఈ బృందం పర్యటిస్తుంది.


Tags:    

Similar News