ఒమిక్రాన్ అలెర్ట్.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.;
ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని కోరింది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. విదేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో మొత్తం 240కిపైగా కేసులు నమోదయిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆసుపత్రుల్లో బెడ్స్ ను...
అన్ని రాష్ట్రాలూ ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని, ఆక్సిజన్ ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించిన మాదిరిగానే ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని కోరింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని కోరింది. కంటోన్మెంట్ జోన్లను గుర్తించి అక్కడ కఠినమైన ఆంక్షలను విధించాలని కోరింది. ఎక్కువమంది ఒకచోట గుమికూడకుండా ఉండేలా ఆంక్షలు విధించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది.