టోల్ బాదుడు..నేటి అర్థరాత్రి నుంచి అమలు

టోల్‌గేట్ ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి.

Update: 2023-03-31 04:13 GMT

టోల్‌గేట్ ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. నేటి అర్థరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి వస్తాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ల ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీన పెంచడాన్ని ఒక క్యాలెండర్‌గా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.

ప్రతి ఏడాది కూడా...
గత ఏడాది వివిధ కేటగిరీ వాహనాలకు ఎనిమిది నుంచి 15 శాతం టోల్‌ఛార్జీలను పెంచారు. ఈసారి మాత్రం ఆ ఛార్జీలను 5.50 శాతానికే పెంచడాన్ని పరిమితం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి టోల్ గేట్ల ద్వారా రెండు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది టోల్ ఛార్జీలను పెంచడం ద్వారా 1,820 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. ఎక్కువ మంది ఫాస్టాగ్ ద్వారానే చెల్పింపులు జరుగుతుండటంతో ఖచ్చితమైన ఆదాయాన్ని అంచనా వేయగలుగుతున్నారు.


Tags:    

Similar News