మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ ఏడాది బడ్జెట్ ను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు ప్రకటించే అవకాశముంది.
ఉద్యోగుల వేతనాలు...
బడ్జెట్ అనంతరం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతానికి పెంచే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల నుంచి 26 వేల రూపాయలకు పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. డీఏను కూడా పెంే అవకాశముందని తెలుస్తోంది.