Jamili Elections : లోక్ సభలో నేడు జమిలి ఎన్నికల బిల్లు
లోక్ సభలో నేడు జమిలి ఎన్నికల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది
లోక్ సభలో నేడు జమిలి ఎన్నికల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుంది. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కానీ ప్రస్తుతం అధికార పార్టీకి బిల్లు ఆమోదం పొందేటంత మెజారిటీ అయితే లేదు. బిల్లు ఆమోదం పొందాలంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ బీజేపీ కూటమికి 293 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే జమిలి ఎన్నికలను దేశంలోని పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఆమోదం పొందుతుందా?
ఈనేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అన్నది సస్పెన్స్ గానే ఉంది. ఒకే దేశం - ఒకే ఎన్నికను నిర్వహించాలని మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. ఇందుకోసం నియమించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక రాజ్యసభలోనూ తగినంత బలం లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ తన సభ్యులందరికీ విప్ జారీ చేసింది. రేపు లోక్ సభకు అందరు సభ్యులు హాజరు కావాలని విప్ జారీ చేసింది.