Zika Virus : జికా వైరస్ కలకలం.. రాష్ట్రాలకు హై అలర్ట్

జికా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Update: 2024-07-04 05:43 GMT

జికా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మహారాష్ట్రలోని పూణేలో జికా వైరస్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. గర్భిణులకు పరీక్షలు జరపడంతోనే ఈ వైరస్ బయటపడింది.

దోమల ద్వారా....
అయితే దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. గర్భిణులకు పరీక్షలు జరపాలని కోరింది. దోమల బెడద లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.


Tags:    

Similar News