శృంగారంపై ఛత్తీస్‌ఘడ్ కోర్టు సంచలన తీర్పు
ఛత్తీస్ ఘడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. శృంగారాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమేనని పేర్కొంది.;
ఛత్తీస్ ఘడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. శృంగారాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమేనని పేర్కొంది. వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. భార్యాభర్తల విడాకుల కేసులో ఛత్తీస్‌ఘడ్ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. తన భార్య తనతో కలిసేందుకు ఇష్టపడటం లేదని, శృంగారానికి అంగీకరించడం లేదంటూ ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు భార్యతో విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు.
విడాకులు మంజూరు....
దీనిపై విచారించిన ఛత్తీస్‌ఘడ్ కోర్టు వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శృంగారాన్ని నిరాకరించం కూడా క్రూరత్వమేనని అభిప్రాయడింది. భార్యా భర్తల మధ్య సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలని, శృంగారం కూడా వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు అభిప్రాయపడింది.