ఎక్కడున్నా తెలుగు వారు ఐక్యంగానే ఉండాలి
తెలుగు వారు ఎక్కడ ఉన్నా అంతా ఐక్యంగా ఉంటారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా అంతా ఐక్యంగా ఉంటారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ఇండో అమెరికన్ స్వాగత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషే అందరినీ ఏకం చేస్తుందన్నారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ లో ఎన్నో మార్పులు వచ్చాయని, మౌలిక సదుపాయాల వృద్ధి శరవేగంగా పెరిగిందన్నారు. కొత్త కొత్త ఆవిష‌్కరణలో భారత్ ముందుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
సరైన నాయకత్వాన్ని....
ఈ సమావేశంలో పాల్గొనడంతో తాను మినీ ఇండియాలో ఉన్నట్లుందని జస్టిస్ రమణ అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో శాంతి లేకుంటే ప్రశాంతతో జీవించలేమని చెప్పారు. ప్రవాస భారతీయులు నాయకులుగా ఎదగాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. భారత్ లో సరైన నాయకులను తయారు చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉందని జస్టిస్ రమణ ఆవేదన చెందారు. నిస్వార్థం, సేవాగుణం కలిగిన నాయకత్వం భారత్ కు అవసరమని జస్టిస్ ఎన్వీరమణ చెప్పారు.