రెండు తెగల మధ్య ఘర్షణ.. కర్ఫ్యూ విధింపు
ఒడిశా బాలేశ్వర్ పట్టణంలో రెండు తెగల మధ్య ఘర్షణ టెన్షన్ పెట్టింది. దీంతో కర్ఫ్యూ విధించారు
ఒడిశా బాలేశ్వర్ పట్టణంలో రెండు తెగల మధ్య ఘర్షణ టెన్షన్ పెట్టింది. సోమవారం సాయంత్రం నుంచి నిన్నరాత్రి వరకు రెండు తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఘర్షణలను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
శాంతి కమిటీ ఏర్పాటుకు...
దీంతో మంగళవారం ఉదయం బాలేశ్వర్ ఎస్పీ సాగరికా నాథ్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. అన్ని చోట్లా గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై పరిస్థితి సమీక్షించారు. శాంతి కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.