మోదీ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Update: 2024-07-31 07:59 GMT

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నిన్నటి అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం అందరూ వినాల్సి తీరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఠాకూర్ చేసిన ప్రసంగంపై...
విపక్షాలపై అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం నిన్న వివాదాస్పదమయింది. సభలో గందరగోళానికి తావిచ్చింది. రాహుల్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నిన్న ఆరోపించింది. అయితే దీనిపై ప్రధాని మోదీ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రశంసించడాన్ని తప్పుపడుతూ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.


Tags:    

Similar News