కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

Update: 2023-05-17 08:39 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు సాయంత్రం 3.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డీకేకు డిప్యూటీ....
డీకే శివకుమార్‌కు మాత్రం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. మంత్రివర్గంలో రెండు కీలకమైన శాఖలను డీకే శివకుమార్‌కు అప్పగించాలని డిసైడ్ చేసింది ఇద్దరి మధ్య రాజీ కుదిర్చడంతో రేపు సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News