తెలుగులో రాహుల్ ట్వీట్

వరి ధాన్యం కొనుగోలు పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.;

Update: 2022-03-29 04:28 GMT

వరి ధాన్యం కొనుగోలు పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. రైతుల శ్రమతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. రెండు ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలుపై నాటకాలు ఆడుతున్నాయని, నైతికబాధ్యతను విస్మరించాయన్నారు.

వరి ధాన్యం కొనుగోలుపై....
రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ కోరారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో రాహుల్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News