నేడు ఈడీ ఎదుటకు సోనియా
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటహాజరుకానున్నారు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరుకానున్నారు. ఈ కేసులో విచారించేందుకు ఈడీ సిద్ధమవయింది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంపై సోనియా గాంధీని నేడు విచారించనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించిన ఈడీ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలోనే సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా సోకిన కారణంగా ఆమె విచారణకు హాజరు కాలేకపోయారు.
కాంగ్రెస్ నిరసన...
అయితే సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతోంది. ధర్నాలతో తమ నిరసనలు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్రనేతలంతా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని నిర్ణయించారు. రాజ్ భవన్ వెలుపల కాంగ్రెస్ శ్రేణులు నిరసనను తెలపనున్నాయి. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ముందుగానే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.