Rahul Gandhi : యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఐదురోజుల పాటు విరామం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు;

Update: 2024-02-21 06:41 GMT
rahul gandhi, congress supremo,  five-day break, bharat jodo nyaya yatra
  • whatsapp icon

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకూ బ్రేక్ ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్నందున ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు చెప్పారు.

సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున...
రాహుల్ గాంధీ గత నెల 14వ తేదీన మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించారు. మార్చి 20వ తేదీ నాటికి ముంబయిలో ఈ యాత్రను ముగించాల్సి ఉంది. కొద్ది దూరం పాదయాత్రగానూ, మరి కొంత దూరం బస్సులు, కార్లలో ఆయన ప్రయాణం సాగుతుంది. హైబ్రిడ్ విధానంలో ఆయన యాత్ర చేపడుతున్నారు. వివిధ వర్గాలతో మమేకం అవుతున్నారు. అయితే రాహుల్ గాంధీ యాత్ర తిరిగి మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జైరాం రమేష్ తెలిపారు.


Tags:    

Similar News