తగ్గనున్న దిగుమతులు.. పెరగనున్న వంటనూనెల ధరలు
భవిష్యత్ లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయంతో భారత్ లో వంటనూనె దిగుమతులపై
సామాన్యుడికి మరో షాక్ తగలనుంది. మరోసారి వంటనూనెల ధరలు పెరగనున్నాయి. రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు.. ఇటీవలే స్వల్పంగా తగ్గాయి. దీంతో.. పేదలు, మధ్యతరగతి వారికి కాస్త ఊరట లభించింది. కానీ.. ఇప్పుడు నూనెపంటల దిగుమతులు తగ్గనుండటంతో వంటనూనెల ధరలు పెరగనున్నాయి. ఇందుకు కారణం ఇండోనేషియా. ఇండోనేషియా నుంచే భారత్ కు ఎక్కువగా వంటనూనెలు దిగుమతి అవుతున్నాయి.
Also Read : కాజోల్ కు కరోనా.. మొహం చూపించలేకపోతున్నా !
అయితే.. భవిష్యత్ లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయంతో భారత్ లో వంటనూనె దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న పామాయిల్‌లో 60 శాతం వాటా ఇండోనేషియాదే ఉంటుంది. ఇండోనేషియా నుంచి దిగుమతులు తగ్గినా.. ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవాలని ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ భావిస్తోంది.