కరోనా కాలర్ ట్యూన్ కు స్వస్తి!

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటు క‌రోనాకు సంబంధించి ప‌లు కాలర్ ట్యూన్స్ ఫోన్ల‌లో..

Update: 2022-03-28 05:00 GMT

న్యూ ఢిల్లీ : రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా విజృంభణ మొదలైన సమయంలో దానిపై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు కరోనా కాలర్ ట్యూన్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. వాటిపై కూడా కాలర్ ట్యూన్ ద్వారా అవగాహన కల్పించారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటు క‌రోనాకు సంబంధించి ప‌లు కాలర్ ట్యూన్స్ ఫోన్ల‌లో వినిపించేవి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గడంతో.. కరోనా కాలర్ ట్యూన్లకు స్వస్తి చెప్పాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం నిన్న ఓ లేఖ రాసింది. సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘంతో పాటు మొబైల్‌ వినియోగదారుల నుంచి కాలర్‌ ట్యూన్‌ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చాయ‌ని అందులో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో వాటిని నిలిపివేయాల‌న్న అంశాన్ని కేంద్ర స‌ర్కారు పరిశీలిస్తోందని తెలిసింది. క‌రోనా కాలర్‌ ట్యూన్స్‌ కారణంగా అత్యవసర సమయాల్లోనూ ఫోన్‌కాల్‌ మాట్లాడటంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ప్రజల నుంచి కూడా త‌మ‌కు విజ్ఞప్తులు అందాయ‌ని దీంతో కేంద్రం ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తున్నట్లు ప్ర‌భుత్వ‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి.


Tags:    

Similar News