మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం
దేశంలో కరోనా కేసులు రోజుకు రెండున్నర లక్షలకుపైగానే నమోదవుతున్నాయి. భారత్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటుందన్నది తెలిసిందే
దేశంలో కరోనా కేసులు రోజుకు రెండున్నర లక్షలకుపైగానే నమోదవుతున్నాయి. భారత్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటుందన్నది తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ సౌతాఫ్రికా నుంచి ఒమిక్రాన్ కేసులు మాత్రమే చూస్తున్నాం. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయితే ఇప్పడు మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. సెకండ్ వేవ్ లో ఈ బ్లాక్ ఫంగస్ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.
యూపీలో...
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఒక బ్లాక్ ఫంగస్ కేసు బయటపడటంతో వైద్య శాఖ అప్రమత్తమయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూరు లోని ఒక ఆసుపత్రిలో ఒక యువకుడికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆయనకు షుగర్ ఉండటంతోనే బ్లాక్ ఫంగస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. మరోసారి దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.