నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది;
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ రోజు నుంచి రాత్రి వేళ కర్ఫ్యూ తమిళనాడులో అమలు కానుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఆన్ లైన్ క్లాసులను నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదివారం లాక్ డౌన్...
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకే ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ప్రతి ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిసైడ్ చేశారు. అయితే ఆదివారం లాక్ డౌన్ సందర్భంగా టేక్ వే సర్వీసులకు మాత్రం అనుమతి ఇచ్చారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనమందిరాల్లోకి భక్తులకు అనుమతించడం లేదు.