భారత్ లో డేంజర్ బెల్స్... ఈరోజు మూడున్నర లక్షల కేసులు

భారత్ లో కరోనా కేసులు మూడున్నర లక్షలకు చేరుకున్నాయి. ఈరోజు కొత్తగా 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;

Update: 2022-01-21 03:58 GMT
corona, positive cases, deaths, recovery, india
  • whatsapp icon

భారత్ లో కరోనా కేసులు మూడున్నర లక్షలకు చేరుకున్నాయి. ఈరోజు కొత్తగా 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 703 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,89,89, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 20,18,825 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,18,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,87,754 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,60,88,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 9,6921 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 17.94 శాతంగా ఉంది.


Tags:    

Similar News