వెస్ట్ బెంగాల్ లో విద్యాసంస్థల మూసివేత

పశ్చిమ బెంగాల్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2021-12-29 12:16 GMT

పశ్చిమ బెంగాల్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. కరోనా పరిస్థితులపై సమీక్ష చేపట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను మమత బెనర్జీ ఆదేశించారు.

ఒక్కరోజులోనే....
నిన్న ఒక్కరోజే పశ్చిమ బెంగాల్ లో 752 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా విద్యాసంస్థలను మూసివేస్తే కరోనా వ్యాప్తి చాలా వరకూ అరికట్టవచ్చన్న నిపుణుల సూచనతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తొలుత విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News