భారత్ లో మళ్లీ పెరుగుతున్న కేసులు

భారత్ లో మళ్ల ీకరోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది

Update: 2022-09-08 04:54 GMT

భారత్ లో మళ్ల ీకరోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 6,395 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 33 మంది మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 6,614 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.7 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.11 శాతంగా నమోదయింది.

యాభై వేలకు యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,44,72,241మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,00,204 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకూ 5,28,090 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 214.27 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News