భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఈరోజు గణనీయంగా తగ్గాయి. ఒక్కరోజులో 6,168 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-09-02 04:22 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు గణనీయంగా తగ్గాయి. ఒక్కరోజులో 6,168 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 21 మంది మరణించారు. ఒక్కరోజులోనే 9,685 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు కూడా 0.14 శాతానికి తగ్గాయని అధికారులు వెల్లడించారు.

యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ దేశంలో 4,44,22,246 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,55,365 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 5,27,932 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 59,210 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2,12,75,23,421 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags:    

Similar News