భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 4,417 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కారణంగా మరణించారు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 4,417 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులో 6,032 మంది కరోనా కారణంగా మరణించారు. రికవరీ రేటు కూడా 98.69 శాతం గా నమోదయిందని తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 0.12 శాతంగా నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని, ఇప్పుడు 4 వేలకు దిగుతుండటం శుభపరిణామం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా కోవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.
మరణాలు తగ్గుదల...
ఇప్పటి వరకూ దేశంలో 4,44,66,862 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,38,80,464 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,030 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 52,336 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకూ