పార్లమెంటులో కరోనా.. 350 మందికి పాజిటివ్
భారత పార్లమెంటులో కరోనా అలజడి రేగింది. పార్లమెంటులో పనిచేస్తున్న 350 మంది సిబ్బందికి కరోనా సోకింది.;
భారత పార్లమెంటులో కరోనా అలజడి రేగింది. పార్లమెంటులో పనిచేస్తున్న 350 మంది సిబ్బందికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా జరుపుతున్న ఈ పరీక్షల్లో అత్యధిక శాతం మంది పార్లమెంటు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యథిక శాతం మంది హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.
వైద్య పరీక్షలు....
ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొందరికి స్వల్ప లక్షణాలు ఉండటంతో పార్లమెంటు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో 350 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. పార్లమెంటు భవనాన్ని శానిటైజ్ చేశారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలకు హాజరయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు