నేడు రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్

డు రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.

Update: 2022-07-21 03:02 GMT

నేడు రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు దేశ 15వ రాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది. పార్లమెంటు హౌస్ లో ఈ లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలట్ బాక్సులను ఢిల్లీకి రప్పించారు. రాష్ట్రాల వారీగా లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.

ముర్ము విజయం...
ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. అయితే క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు తెలిసింది. ద్రౌపది ముర్ముకు మద్దతు పెరగడంతో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికవ్వడం ఖాయమని అంచనా. గిరిజనులు ఇప్పటికే ఆమె ఎన్నిక కావాలని ప్రార్థనలు చేస్తున్నారు.


Tags:    

Similar News