ఎండాకాలం ముందే వస్తుందట
దేశంలో ఎండలు రానున్న కాలంలో మండి పోనున్నాయి. ఎండాకాలం కూడా ఈఏడాది ముందుగానే వస్తుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది;
దేశంలో ఎండలు రానున్న కాలంలో మండి పోనున్నాయి. ఎండాకాలం కూడా ఈఏడాది ముందుగానే వస్తుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రానున్న ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సాధారణ వేసవి కాలం కన్నా ఈసారి ఎక్కువగానే ఎండలు ఉంటాయని తెలిపింది.
ఎక్కువ కాలం...
వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. మార్చి నెల నుంచే మండే ఎండలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ ఎండాకాలం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కూడా లేకపోలేదని తెలిపింది.