ప్రమాదానికి కారణమదే.. తేల్చి చెప్పిన విచారణ కమిటీ

బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదంపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికను అందజేసింది.

Update: 2022-01-15 02:14 GMT

బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదంపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికను అందజేసింది. గత ఏడాది డిసెంబరు 8 బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై విచారించిన త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికను బయటపెట్టింది.

సాంకేతిక సమస్యలు...
అయితే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. వాతావరణ మార్పులు వల్లనే ప్రమాదానికి కారణమని పేర్కొంది. సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయని చెప్పింది. ఫ్లైట్ డేటా రికార్డర, కాక్ పిట్ వాయిస్ రికార్డ్ విశ్లేషణల ప్రకారం ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడమేనని తేల్చింది.


Tags:    

Similar News