రెండువారాల్లో 16 మందిని చంపిన ఏనుగు.. 144 సెక్షన్

రాంచీ జిల్లాలోనే నలుగురిని పొట్టనపెట్టుకుంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2023-02-22 05:32 GMT

jharkhand elephant kills 16 people

ఓ ఏనుగు 16 మందిని పొట్టన పెట్టుకుంది. కంటికి కనిపించిన వారిపై దాడి చేసి, చంపేస్తోంది. ఝార్ఖండ్ లో ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. గడిచిన 12 రోజుల్లో ఐదు జిల్లాల్లో 16 మందిని బలితీసుకుంది. రాంచీ జిల్లాలోనే నలుగురిని పొట్టనపెట్టుకుంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదుగురికి మించి.. జనం గుంపులు గుంపులుగా తిరగకుండా.. జిల్లాలోని ఇటకీ బ్లాకులో 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఆ ఏనుగును బంధించేందుకు పశ్చిమబెంగాల్ నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. ఏనుగు దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ తెలిపారు. 2017 నుంచి గత ఐదేళ్లలో ఏనుగుల బారినపడి 462 మంది ప్రాణాలు కోల్పోయారు.





Tags:    

Similar News