తమిళనాడులో నేడు లాక్ డౌన్
తమిళనాడులో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఆదివారం లాక్ డౌన్ విధించడంతో వీధులన్నీ బోసి పోయి కన్పిస్తున్నాయి.
తమిళనాడులో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఆదివారం లాక్ డౌన్ విధించడంతో వీధులన్నీ బోసి పోయి కన్పిస్తున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసులు తీవ్రం అవుతుండటంతో ప్రతి ఆదివారం లాక్ డౌన్ ను విధించాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనేక రకాలైన ఆంక్షలు విధించింది.
అత్యవసర సేవలు మినహా...
ఆదివారం లాక్ డౌన్ అని ముందుగానే ప్రకటించింది. శనివారం రాత్రి నుంచే అన్ని వంతెనలను పోలీసులు మూసివేశారు. కరోనా వైరస్ కట్టడి కావాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన ఎటువంటి సంస్థలను తెరిచేందుకు అనుమతి లేదు.