Fastag : రేపటితో ఆఖరి గడువు.. ఫాస్టాగ్ యూజర్లకు లాస్ట్ వార్నింగ్

పేటీఎం పేమెంట్ బ్యాంక్ కి ఆర్భీఐ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో జాతీయ రహదారుల సంస్థ ఫాస్టాగ్ యూజర్లకు కీలక సూచనలు చేసింది;

Update: 2024-03-14 03:46 GMT
paytm payment bank, national highway authority, rbi, fastag users
  • whatsapp icon

పేటీఎం పేమెంట్ బ్యాంక్ కి రిజర్వ్ బ్యాంక్‌ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో జాతీయ రహదారుల సంస్థ ఫాస్టాగ్ యూజర్లకు కీలక సూచనలు చేసింది. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు వెంటనే ఇతర సంస్థలకు మారిపోవాలని పేర్కొంది. మారడం వల్ల తమ ప్రయాణంలో టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ిఇబ్బందులు తలెత్తవని తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను జాతీయ రహదారుల సంస్థ తొలగించింది.

పేటీఎం పేమెంట్ బ్యాంకు....
దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంకు నుంచి ఫాస్టాగ్ ను ఉపయోగించే వారికి మరో రోజులో పనిచేయదు. ఇతర బ్యాంకులకు ఫాస్టాగ్ ను మార్చుకోవాలని సూచించింది. ఈ జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంక్ వంటి మొత్తం 32 బ్యాంకులకే అనుమతిచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుండటంతో రేపటి నుంచే పేటీఎం బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ పనిచేయదు. మరోసారి గడువు పొడిగించే అవకాశమే లేదని ఆర్బీఐ తెలిపింది. దీంతో ఒకరోజు సమయం మాత్రమే ఉండటంతో ఫాస్టాగ్ యూజర్లు తమ బ్యాంక్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News