Kerala : వాయనాడ్ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది

Update: 2024-07-30 04:42 GMT

వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటి వరకూ 19 మృతదేహాలను బయటకు తీశారు. కేరళలో భారీ వర్షాలకు వాయనాడ్ లో జరిగిన ఈ దుర్ఘటనలో కొండచరియలు విరిగిపడటంతో అటువైపు ప్రయాణిస్తున్న వారు అందులో ఇరుక్కుపోయారు. వాహనాలతో పాటు ప్రయాణికులు కూడా అందులో ఉన్నారని తెలిసింది.

19కి చేరిన...
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఆరు వందల మంది ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. వెలికి తీసే కార్యక్రమానికి భారీ వర్షం అడ్డంకిగా మారింది. ప్రధాని మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ ‌గ్రేషియో ప్రకటించారు. శిధిలాల కింద అనేక మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నాు.


Tags:    

Similar News