Landslide : కేరళ విలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. శిధిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఆర్మీ, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు 24/7 సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 289 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను గుర్తు పట్టడం కూడా కష్టంగా మారింది. ఎవరనేది గుర్తించడానికి సాధ్యపడటం లేదు.
పోస్టుమార్టం చేయలేక
శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు పోస్టుమార్టం చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక తాను పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇంకా ఎంత మంది శిధిలాల కింద ఉంటారన్నది తెలియరాలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం ఆగడంతో పనులు ఊపందుకున్నాయి.