Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది.

Update: 2024-06-17 07:52 GMT

పశ్చిమ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ ను వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం ఎనిమిదన్నర గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అరవై మంది ప్రయాణికుల వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎక్స్ గ్రేషియో...
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిని దురదృష్టకరమైన ఘటనగా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటన స్థలికి చేరుకున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ బాధితులను పరామర్శిస్తున్నారు. దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News