ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులు

రాజీవ్ విషం తీసుకునేందుకు యత్నించగా.. అతని భార్య అడ్డుపడింది. దాంతో ఆయన ‘‘ప్రభుత్వం నా మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా

Update: 2022-02-10 05:45 GMT

ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మరణించగా.. వ్యాపారి రాజీవ్ చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఆత్మహత్యాయత్నం చేసే ముందు రాజీవ్ తోమర్ ఫేస్ బుక్ లైవ్ లో ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆత్మహత్యకు మోదీనే కారణమవుతారని వాపోయారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా తాను అప్పులపాలయ్యానని, లాక్ డౌన్ కారణంగా ఆ అప్పులు మరింత ఎక్కువయ్యాయని తెలిపారు. ప్రధానికి చేతనైతే దేశంలో తనలాంటి వ్యాపారులను ఆదుకోవాలన్నారు.

ఆ తర్వాత లైవ్ లోనే రాజీవ్ విషం తీసుకునేందుకు యత్నించగా.. అతని భార్య అడ్డుపడింది. దాంతో ఆయన ''ప్రభుత్వం నా మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా నా మాట విను'' అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో.. భార్య కూడా వెంటనే విషం తాగేసింది. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భార్య పూనం మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు. కాగా.. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతినడంతో.. చేసిన అప్పులు తీర్చే దారిలేకపోయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News