Aravind Kejrival : కేజ్రీవాల్ కు దక్కని ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు;
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన తన బెయిల్ ను పొడిగించాలంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ అభిప్రాయడ్డారు. పిటీషన్ ను కొట్టివేశారు.
బెయిల్ ముగియనుండటంతో...
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ఆ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.