మోదీ.. పేదలకు పంచితే వృధానా?
ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు
ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. పేదల పథకాలను రద్దు చేసేందుకు మోదీ కుట్ర పన్నారని ఆయన అన్నారు. పేదలకు ఉచిత పథకాలను అందిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం, విద్య అందించాలని కేజ్రీవాల్ అన్నారు.
పారిశ్రామికవేత్తలకు...
పేదలకు ఉచిత పథకాలను ఇస్తుంటే అభ్యంతరం చెప్పే కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం దోచి పెడుతుందన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయలను రుణాలను మాఫీ చేసిందని మండి పడ్డారు. పేదలంటే మోదీకి ఎందుకంత కసి అని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మాత్రమే అండగా నిలుస్తుందని, పేదలంటే వారికి అలుసుగా మారిందని వ్యాఖ్యానించారు.