Aravind Kejrival : నేడు లొంగిపోనున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. నేడు తీహార్ జైలుకు ఆయనను తరలించనున్నారు. బెయిల్ గడువు ముగియడంతో అరవింద్ కేజ్రీవాల్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తనకు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మధ్యంతర బెయిల్ ను...
ఆయన ఢిల్లీకోర్టు మధ్యంతర బెయిల్ పిటీషన్ పై జూన్ 5వ తేదీన నిర్ణయం తీసుకోనేుంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేడు జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఆయన కూడా తాను లొంగిపోనున్నట్లు ముందుగానే తమ పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియనుండటంతో ఈరోజు మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు.