నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది;

Update: 2021-12-27 02:38 GMT

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీలో 79 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయింది.

కఠిన ఆంక్షల దిశగా....
తొలుత క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధించింది. ఎటువంటి సామూహిక సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు తాజాగా నైట్ కర్ఫ్యూ ను ఈరోజు నుంచి అమలు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News