అవన్నీ ఫేక్ ఫోన్ కాల్స్.. పటిష్ట భద్రత
దేశ రాజధాని ఢిల్లీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబై ఉంది. ఈ సమయంలో బాంబు
దేశ రాజధాని ఢిల్లీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబై ఉంది. ఈ సమయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడంతో.. అప్రమత్తమైన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. శ్రమశక్తి భవన్ సమీపంలో అమర్చిన బ్యాగులో ఏమీ కనిపించలేదని.. ఆ బ్యాగ్ ఓ ఎలక్ట్రిషియన్ కు చెందినదిగా గుర్తించారు. ఎర్రకోట, కశ్మీర్ గేట్, సరితా విహార్ లోని ప్రాంతాల్లో ఉన్న బ్యాగులను సైతం అధికారులు తెరిచి చూడగా వాటిలో ఎలాంటి పేలుడు పదర్థాలు కనిపించలేదు. రంగంలోని దిగిన ప్రత్యేక అధికారులు, విచారణ జరిపిన కొద్దిసేపటి తర్వాత అవన్నీ బోగస్ కాల్స్ గా పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఏమీ తేలకపోవడంతో శ్రమశక్తి భవన్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ను ఆంక్షలను తొలగించారు.