Maharashtra : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయనచేత మహారాష్ట్ర ముఖ్యమత్రిగా గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ మూడో సారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మూడోసారి ముఖ్యమంత్రిగా...
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రకు తొలిసారి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత మరో ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తర్వాత రాజీనామా చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.