శబరిమలలో ఆహారం.. నీరు దొరక్క?

శబరిమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో కనీసం ఆహారం, నీరు కూడా దొరకడం లేదు;

Update: 2022-12-13 04:55 GMT
శబరిమలలో ఆహారం.. నీరు దొరక్క?
  • whatsapp icon

శబరిమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో కనీసం ఆహారం, నీరు కూడా దొరకడం లేదు. దీంతో లక్షలాది మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శబరిమలలో భక్తుల ఇబ్బందులపై కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. భక్తులందరికీ బిస్కెట్లు, మంచినీరు అందించాలని ఆదేశించింది.

హైకోర్టు జోక్యంతో...
ఒక్కసారిగా పెరిగిన భక్తులతో శబరిమల అయ్యప్ప నామస్మరణలతో మార్మోగుతుంది. పంబ నుంచి క్యూ లైన్ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులోనే 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కమిటీ పేర్కొంది. లక్షల్లో భక్తుల సంఖ్య చేరుకోవడంతో ఆహారం, నీరు కూడా దొరకడం లేదు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.


Tags:    

Similar News