మరో ఘనత సాధించిన డీఆర్డీవో.. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనత సాధించింది. డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSAM)ను విజయవంతంగా పరీక్షించారు. ఎవాల్యుషన్ ట్రయల్స్‌లో భాగంగా మిస్సైల్ పరీక్షలు నిర్వహించినట్లు డీఆర్డీవో తెలిపింది. ఫైనల్ డెప్లాయ్‌మెంట్ కాన్ఫిరిగేషన్‌లో భాగంగా స్వదేశీ ఆర్‌ఎఫ్ సీకర్, మొబైల్ లాంచర్, పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టీ ఫంక్షన్ రాడార్‌లతో కూడిన క్షిపణితో సహా స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన అన్ని సబ్ సిస్టమ్స్‌ను పరీక్షించారు.
ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM) సిస్టమ్ యొక్క ఆరు విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తయిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ తో గాలిలో వస్తున్న శత్రువుల మిసైల్స్ వంటి వాటిని చేధించవచ్చు. ఈ మిస్సైల్ 30 కిలోమీటర్ల పరిధిలో పది కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే లక్ష్యాలను ఛేధిస్తుంది. భారత సైన్యానికి రక్షణ కవచాన్ని అందించడానికి DRDO రూపొందించి.. అభివృద్ధి చేసింది.
ఏకంగా ఆరు ఫ్లైట్ టెస్టులు నిర్వహించారు. ఆరు హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలను టార్గెట్ చేసుకుని ఈ పరీక్షలు నిర్వహించారు. వివిధ పరిస్థితులలో ఆయుధ వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేశారు. లాంగ్ రేంజ్-మీడియం ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్- మెనోవరింగ్ టార్గెట్, లో రాడార్ సిగ్నేచర్.. ఇలాంటి వాటిని అంచనా వేయడానికి మిసైల్స్ ను టెస్ట్ ఫైర్ చేశారు. తక్కువ సమయంలో ఎంత వరకూ ఇవి ప్రభావం చూపుతాయోనని పరీక్షించారు. ఈ పరీక్షల సమయంలో వెపన్ సిస్టం ఎలా పని చేస్తుంది.. అల్గారిథమ్‌లతో నియంత్రణ సాధ్యమా..? ఖచ్చితత్వాన్ని చేరుకుంటున్నాయా అనే లక్ష్యాలు నెరవేరాయని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ITR ద్వారా అమలు చేయబడిన టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (EOTS) వంటి వాటి ద్వారా సంగ్రహించబడిన డేటా నుండి సిస్టమ్ పనితీరు నిర్ధారించబడింది. ఈ ప్రయోగాల్లో డిఆర్‌డిఓ, భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
ఈ వ్యవస్థను DRDO ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), పూణే, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్లు), పూణే; ఎలక్ట్రానిక్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, బెంగళూరు; ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, డెహ్రాడూన్; హైదరాబాద్, బాలాసోర్ లలోని మిస్సైల్ కాంప్లెక్స్ లేబొరేటరీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.