భారీగా తగ్గిపోయిన టమాటా ధరలు.. ధర తగ్గాలని పూజలు

టమాటా ధరలు తగ్గుతూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా

Update: 2023-08-05 02:31 GMT

టమాటా ధరలు తగ్గుతూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా రూ.50 తగ్గిందని మీడియా సంస్థలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని మండీల్లో శుక్రవారం టమాట కిలో రూ.150కి విక్రయించగా.. గురువారం వరకు ఢిల్లీలో టమాట కిలో రూ.180 నుంచి 200 వరకు విక్రయించారు. ఘాజీపూర్ మండిలో టమాటా కిలో 120 నుంచి 150 రూపాయలు పలుకుతోంది. వర్షాలు తగ్గడంతో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రోజూ సరిపడా టమాటాలు సరఫరా అవుతూ ఉండడంతో టమాటాల ధర తగ్గింది. కర్నాటక నుండి బెంగళూరు, ఇతర నగరాలకు టమాటా సరఫరా పెరగడంతో టమాటాల రేట్లు తగ్గుతున్నట్లు మార్కెట్ లోని వ్యాపారులు చెబుతున్నారు.

టమాటాల ధరలు తగ్గేలా చూడాలంటూ తమిళనాడులో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని నాగపట్టినం జిల్లా కురుకుడిలో మహా మరియమ్మన్, నాగమ్మన్ ఆలయానికి చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఆడి నెల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టమాటాల ధర తగ్గించు తల్లీ అంటూ.. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారుచేసి అమ్మవారికి అలంకరించారు. భారీగా పెరిగిన ధరల వల్ల టమాటాలు తినలేకపోతున్నామని కొంతమంది భక్తులు ప్రత్యేక పూజ చేశారు.


Tags:    

Similar News